LOADING...
Tirupati: వైకాపా పాలనలో మరో కుంభకోణం.. గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం
గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం

Tirupati: వైకాపా పాలనలో మరో కుంభకోణం.. గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 23, 2025
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

తిరుమల కొండపైనే కాకుండా, కొండ దిగువ ప్రాంతాల్లో కూడా వైసీపీ పాలన సమయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే తిరుమలలో పరకామణి చోరీలు, కల్తీ నెయ్యి వినియోగం, వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి అంశాలపై విచారణ కొనసాగుతుండగా, తాజాగా తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురానికి సంబంధించిన పనుల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపణలు తెరపైకి వచ్చింది. ఈ పనుల్లో దాదాపు 50 కిలోల బంగారం గల్లంతైనట్లు సమాచారం వెలుగులోకి రావడంతో, దేవస్థాన విజిలెన్స్ విభాగం లోతైన విచారణ ప్రారంభించింది. అదేవిధంగా, ఈ పనుల సమయంలో 30 విగ్రహాలు ధ్వంసమైన అంశం కూడా తాజాగా బయటపడింది.

వివరాలు 

బంగారు తాపడం పేరుతో అవకతవకలు 

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి అత్యంత చారిత్రక, ధార్మిక ప్రాధాన్యం ఉంది. వైకాపా ప్రభుత్వం హయాంలో 2022-23 కాలంలో ఈ ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సుమారు 100 కిలోల బంగారాన్ని కేటాయించింది. నిబంధనల ప్రకారం విమాన గోపురంపై తొమ్మిది పొరలుగా బంగారు తాపడం చేయాల్సి ఉండగా, వాస్తవంగా కేవలం రెండు పొరలతోనే పనులు పూర్తి చేసి, మిగిలిన బంగారంలో సగం వరకు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో విమాన గోపురంపై ఉన్న 30 విగ్రహాలను ధ్వంసం చేసి, ఆపై బంగారు తాపడం పనులు నిర్వహించినట్లు అప్పట్లోనే ఫిర్యాదులు అందినట్టు సమాచారం.

వివరాలు 

బంగారు తాపడం పేరుతో అవకతవకలు 

ఈ వ్యవహారం బయటకు రాకుండా అప్పటి తితిదే ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ధర్మారెడ్డి జాగ్రత్తలు తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఈ పనులకు అసలు కాంట్రాక్టర్‌ను పక్కన పెట్టి, సబ్ లీజు రూపంలో మరొద్దరికి పనులు అప్పగించారనే ఫిర్యాదులు కూడా దేవస్థానానికి అందాయి. ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించిన అన్ని అంశాలపై తితిదే విజిలెన్స్ విభాగం సమగ్ర విచారణ చేపట్టింది. అప్పట్లో ఫిర్యాదు చేసిన వ్యక్తుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు, బంగారు తాపడం పనులు చేసిన కార్మికులను కూడా ప్రశ్నిస్తోంది. ఎన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి? ఎంత మేరకు బంగారం వినియోగించారు? అనే అంశాలపై విస్తృతంగా ఆరా తీస్తోంది.

Advertisement