దేశంలో కొత్తగా 552 మందికి కరోనా, 6మరణాలు
దేశంలో గత 24గంటల్లో 552 కరోనా కొత్త కేసులు నమోదైనట్లు బుధవారం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్రమంలో మంగళవారంతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,591కు చేరుకున్నాయి. దేశంలో కొత్తగా ఆరుగురు చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం కరోనా మరణాలు 5,31,849కు పెరిగినట్లు వెల్లడించాయి. రికవరీ రేటు 98.8% వద్ద నమోదైంది. మరణాలు రేటు 1.18శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 220.66 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను అందించినట్లు కేంద్రం తెలిపింది. మూడు సంవత్సరాల క్రితం కరోనా ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో ఇప్పటి వరకు 4.49 కోట్ల కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం చెప్పింది.