LOADING...
Chhattisgarh: రాయ్‌పూర్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి
రాయ్‌పూర్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి

Chhattisgarh: రాయ్‌పూర్‌ స్టీల్‌ప్లాంట్‌ వద్ద ప్రమాదం.. ఆరుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 26, 2025
07:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాయ్‌పూర్‌ నగర శివారులోని ఒక ప్రైవేట్‌ స్టీల్‌ ప్లాంట్‌లో శుక్రవారం ఘోరప్రమాదం జరిగింది. గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో నిర్మాణ భాగం కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. సిల్తారా ప్రాంతంలో ఉన్నఈ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు ప్రారంభించారు. "ప్రాథమిక సమాచారం ప్రకారం,కూలిన నిర్మాణం కింద చిక్కుకున్న ఆరుగురి మృతదేహాలను వెలికి తీశాం.అలాగే గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించాం" అని రాయ్‌పూర్‌ ఎస్పీ లాల్ ఉమేద్ సింగ్ తెలిపారు. అయితే,కూలిన శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుని ఉండే అవకాశముందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.గాయపడిన కార్మికులను సమీపంలోని ఆసుపత్రుల్లో చికిత్సకు తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గోదావరి ఇస్పాట్ లిమిటెడ్‌కి చెందిన ప్లాంట్‌లో కూలిన నిర్మాణ భాగం