Telangana: ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్‌కు 60,792 మంది వెబ్ ఆప్షన్లు
వ్రాసిన వారు
Sirish Praharaju
Jul 21, 2026
08:59 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ రెండో విడతకు 60,792మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసి బీటెక్ సీట్ల కోసం పోటీలో నిలిచారు. తొలి విడతలో సుమారు 79వేల మందికి సీట్లు కేటాయించగా,వారిలో 60,300మంది మాత్రమే ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేశారు. ఈఅభ్యర్థుల్లో అధిక శాతం మంది మరింత మెరుగైన కళాశాల లేదా తమకు నచ్చిన కోర్సులో ప్రవేశం పొందాలనే ఉద్దేశంతో రెండో విడత కౌన్సెలింగ్‌లో మళ్లీ వెబ్ ఆప్షన్లు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రెండోవిడత కౌన్సెలింగ్‌లో మొత్తం 26.55లక్షల వెబ్ ఆప్షన్లు నమోదయ్యాయి. దీంతో ఒక్కో అభ్యర్థి సగటున 44వరకు కాలేజీలు,కోర్సులకు ఆప్షన్లు ఇచ్చినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈనెల 22న రెండో విడత సీట్ల కేటాయింపు ఫలితాలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.