Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
ఈ వార్తాకథనం ఏంటి
బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అలాగే సౌదీ అరేబియాలోని దమ్మమ్ నుంచి కొచ్చి వరకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వారు ధన్యవాదాలు తెలిపారు.
వివరాలు
సౌదీ అరేబియా నుంచి ట్రాన్సిట్ వీసాలు జారీ
భారత ప్రభుత్వం సమర్థంగా నిర్వహించిన దౌత్య సమన్వయం వల్ల సౌదీ అరేబియా నుంచి ట్రాన్సిట్ వీసాలు జారీ కావడం సాధ్యమైందని వారు వివరించారు. ఈ ప్రక్రియలో బాధిత కుటుంబాలు,ప్రభుత్వ అధికారుల మధ్య కీలక మధ్యవర్తులుగా బహ్రెయిన్ తెలుగు అసోసియేషన్, గల్ఫ్ ఎయిర్ సంస్థలు వ్యవహరించాయని తెలిపారు. ఈ కష్ట సమయంలో అక్కడి తెలుగు సమాజం చూపిన ఐక్యత కూడా ప్రత్యేకంగా నిలిచిందని కుటుంబాలు పేర్కొన్నాయి.