దేశంలో భారీగా పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 8,000 మందికి వైరస్
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో గత 24 గంటల్లో కరోనా కొత్త కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో దాదాపు 8వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్తగా 7,830 మందికి కరోనా సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది.
కొత్త కేసులతో కలిపి మొత్తం బాధితులు 40,215కి చేరినట్లు కేంద్రం పేర్కొంది.
రోజువారీ పాజిటివిటీ రేటు 3.65శాతం కాగా, వారాంతపు పాజిటివిటీ రేటు 3.83శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సోమవారం, మంగళవారం మాక్ డ్రిల్‌లు నిర్వహించడం వల్లే కరోనా కేసుల భారీ పెరుగుదలకు కారణం అయి ఉండొచ్చని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
కరోనా
కరోనాతో కొత్తగా 16మంది మృతి
దేశంలో మొత్తం రికవరీ రేటు 98.72%కి పెరగడంతో ఇప్పటివరకు మొత్తం 4,42,04,771 మంది కోలుకున్నట్లు కేంద్రం తెలిపింది.
గత 24గంటల్లో కరోనా కారణంగా 16 మంది చనిపోయినట్లు కేంద్రం నివేదించింది. తాజా మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 5,31,016కు పెరిగింది. మరణాల రేటు 1.19%గా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత ఏడాది సెప్టెంబర్ 1న దేశంలో ఒకేరోజు 7,946 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ కింద 220.66 కోట్ల డోసులను అందించినట్లు మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.