Delhi: బేబీ కేర్ హాస్పటల్ లో అగ్నిప్రమాదం.. ఏడుగురు చిన్నారుల మృతి..!
ఈ వార్తాకథనం ఏంటి
నవజాతి శిశువులు అగ్ని కీలలకు ఆహుతి అయ్యారు. ఈ విషాధ ఘటన దేశ రాజధాని న్యూదిల్లీలో శనివారం రాత్రి జరిగింది.
వివేక్ విహార్ లోని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ ఆక్సిజన్ సిలిండర్ పేలటంతో మంటలు చెలరేగాయి.
దీంతో అక్కడికక్కడే ఏడుగురు పసి పిల్లలు అగ్నికి బలయ్యారు. ఆసుపత్రిలో మొత్తం 12 మంది నవజాతి శిశువులు వున్నారు.
వారిలో ఒకరు ముందే చనిపోయారు. కాగా మిగిలిన ఆరుగురు అగ్ని ప్రమాదంలో మృత్యు వాతపడ్డారు.
మిగతా వారిని చికిత్స కోసం వేరే ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు న్యూబోర్న్ బేబీ కేర్ హాస్పటల్ యజమానిపై కేసు నమోదు చేశారు.
Details
మంటలను అదుపు చేయటానికి 16 ఫైరింజన్లు
యజమాని నవీన్ కిచ్చిపై ఐ.పి.సి 336 , 304ఎ కింద నిర్లక్ష్యం,సరైన భద్రతా ప్రమాణాలు లేవనే సెక్షన్ ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
ప్రమాదం జరిగిన విషయం తెలియగానే ఆసుపత్రి యజమాని పరారయ్యాడు.
ప్రాణాలతో ఉన్న నవజాతి శిశువులను తూర్పు ఢిల్లీ లోని NICU హాస్పటల్ కి తరలించారు.
చనిపోయిన ఏడుగురు పిల్లలను పోస్ట్ మార్టం కోసం GTB ఆసుపత్రికి పంపారు. ఈ మేరకు షాహ్ద్రా డిసిపి ఓ ప్రకటనలో తెలిపారు.
కాగా ఈ మంటలను అదుపు చేయటానికి 16 ఫైరింజన్లను రప్పిచామని ఢిల్లీఅగ్నిమాపక విభాగపు అధిపతి అతుల్ గార్గ్ తెలిపారు.
ఆదివారం ఉదయానికి మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.