Page Loader
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 13, 2023
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు, కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక చిన్నారి సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బంథాడి గ్రామానికి చెందిన తిత్రి చౌరహా మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని దివానాలోని ప్రభుత్వ బంగర్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య కోసం జైపూర్‌కు తరలించారు. మృతులందరూ సికార్ జిల్లా వాసులని పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ధరమ్‌చంద్ పునియా తెలిపారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారుగా పేర్కొన్నారు. వారు సికార్ నుంచి నాగౌర్‌కు వివాహ వేడుకకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు