Page Loader
Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా
Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా

Russia: పంజాబ్ వాసుల ఘోస; పర్యటనకు వెళ్తే.. బలవంతంగా ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపిన రష్యా

వ్రాసిన వారు Stalin
Mar 06, 2024
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు చెందిన ఏడుగురు యువకులు సహాయం కోసం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. న్యూ ఇయర్‌ని జరుపుకోవడానికి టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లగా.. తమను మోసం చేసి రష్యన్ సైన్యంలోకి చేర్చుకుని ఉక్రెయిన్‌పై యుద్ధానికి పంపారని వారు వాపోయారు. ఈ మేరకు వారు సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియో ప్రకారం.. ఏడుగురు యువకులు రష్యన్ సైనికుల యూనిఫారాలు ధరించి, భయంతో చూస్తున్నట్లు కనిపించింది. ఆ ఏడుగురిలో ఒకరు తమ ధీన పరిస్థితిని వివరిస్తూ.. ప్రభుత్వం నుంచి సాయం కోరుతున్నట్లు కనిపిస్తుంది.

రష్యా

బెలారస్‌లో పట్టుబడ్డ ఏడుగురు

ఆ ఏడుగురిలో ఒకరైన గగన్‌దీప్ సింగ్ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. డిసెంబర్ 27న న్యూ ఇయర్ జరుపుకోవడానికి ఏడుగురు పంజాబ్ నుంచి రష్యా వెళ్ళారు. వీరికి రష్యా వరకే వీసాలు ఉన్నాయి. ఆ వీసాలకు 90రోజులే వ్యాలిడిటీ ఉంటుంది. రష్యాలోని ఒక ఏజెంట్ వీరిని.. బెలారస్‌కు తీసుకెళ్తానని చెప్పాడు. అయితే బెలారస్ అనేది ఒక దేశమని, దానికి వీసా కావాలని వీరికి తెలియదు. ఈ క్రమంలో ఆ ఏజెంట్ ఏడుగురి దగ్గర కొంత నగదు తీసుకొని, వారిని బెలారస్‌లో వదిలి పెట్టాడు. అనంతరం వీరిని పోలీసులు పట్టుకున్నారు. రష్యన్ అధికారులకు అప్పగించారు. రష్యా అధికారులు ఏడుగురితో పత్రాలపై సంతకం చేయించారు. ఆ పత్రాలలో రష్యాలో రాసి ఉన్నందున వీరికి అర్థం కాలేదు.

రష్యా

విదేశాంగ శాఖను ఆశ్రయించిన గగన్ దీప్ సింగ్ కుటుంబం

ఆ తర్వాత వీరికి రష్యా ఆర్మీ దుస్తులు ఇచ్చి.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లమని అధికారులు ఒత్తిడి చేయడం ప్రారంభించారు. యువకులకు 15 రోజుల శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్‌తో యుద్ధానికి పంపారు. అయితే రష్యా అధికారులు సంతకాలు చేయించిన పత్రాల్లో షాకింగ్ విషయాలు ఉన్నట్లు ఆ తర్వాత తెలిసింది. వీసా నిబంధనలను ఉల్లంఘించినందున 10ఏళ్ల జైలు శిక్ష అనుభవించడం లేదా రష్యా సైన్యంలో చేరాలన్న నిబంధన ఆ పత్రంలోఉంది. దీంతో గగన్ దీప్ సింగ్ కుటుంబం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. వారు రష్యా భాషలో ఉన్న పేపర్లను అర్థం చేసుకోలేక, వాటిని చదవకుండానే సంతకాలు చేశారని గగన్‌దీప్ సింగ్ అతని సోదరుడు అమృత్ సింగ్ తెలిపారు.