తదుపరి వార్తా కథనం

Chhattisgarh: దంతెవాడలో 71 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగుబాటు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 24, 2025
03:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ జిల్లాలో మొత్తం 71 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా సమర్పణ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో 30 మంది మావోయిస్టులపై రూ.64 లక్షల వరకు రివార్డులు ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ లొంగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో మావోయిస్టుల దౌర్జన్యాలు తగ్గే అవకాశముందని పోలీసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.