తదుపరి వార్తా కథనం
Hyderabad: దేశవ్యాప్తంగా 7వ రోజు కొనసాగుతున్న 'ఇండిగో' సంక్షోభం.. హైదరాబాద్‌లో 77 సర్వీసులు రద్దు
వ్రాసిన వారు
Sirish Praharaju
Dec 08, 2025
09:16 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇండిగో విమాన సర్వీసులు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఏదో రోజూ రద్దు అవుతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్‌కు రాబోయే 38 విమానాలు, హైదరాబాద్ నుంచి బయలుదేరాల్సిన 39 విమానాలు రద్దు చేయబడ్డాయి. దీంతో దేశవ్యాప్తంగా ఇదిగో విమానాల రద్దు మొత్తం 500కి చేరింది. ఈ పరిస్థితిలో, ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. తమకు ప్రత్యామ్నాయ ప్రయాణ సదుపాయాలను అందించాలని ఇండిగో సిబ్బందితో వారు వాగ్వాదానికి దిగుతున్నారు. ఇతర నగరాలతో పోలిస్తే, ముంబైలో 112, ఢిల్లీ 109, బెంగళూరు 124 విమానాలు రద్దు అవ్వగా, హైదరాబాద్‌లో ఈ సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.