7th Pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త: రెండేళ్ళు సెలవు పెట్టినా జీతం వచ్చేస్తుంది
ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులకు సంబంధించిన సెలవుల విషయంలో కొన్ని సవరణలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ సవరణల ప్రకారం, ఇక నుండి ఆల్ ఇండియా సర్వీస్ సభ్యులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పదవీకాలం మొత్తంలో రెండు సంవత్సరాల లీవును తీసుకోవచ్చు. ఈ రెండు సంవత్సరాల కాలానికి వేతన చెల్లింపులు ఉంటాయి. అంటే, వేతన కోతలు లేకుండా, వేతన చెల్లింపుతో కూడిన రెండు సంవత్సరాల సెలవులు తీసుకోవచ్చు. 18సంవత్సరాలు నిండని తమ పిల్లల ఆరోగ్యం, సంరక్షణ మొదలగు విషయాల్లో పిల్లల పట్ల కేర్ తీసుకోవడానికి ఈ సెలవులను తీసుకోవచ్చని తెలిపింది.
ప్రొబేషనరీ ఉద్యోగులకు వర్తించని సెలవులు
మొత్తం ఇద్దరు పిల్లలకు గాను రెండు సంవత్సరాలు వేతనంతో కూడిన సెలవులను తీసుకోవచ్చు. మొదటిసారి సంవత్సరం పాటు సెలవు తీసుకుంటే వందకు వందశాతం వేతనం అందివ్వబడుతుంది. రెండవ సారి తీసుకుంటే తమ జీతంలో 80శాతాన్ని చెల్లించనున్నారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్ లో, ఆల్ ఇండియా చిల్డ్రన్ లీవ్ రూల్ 1995ని సవరించడంతో ఈ నియమం అమల్లోకి వచ్చింది. అంతేకాదు, దీని ప్రకారం ఏడవ వేతన సంఘం జీతాలు ఉద్యోగులకు అందుతాయని సమాచారం. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొబేషనరీలో ఉన్న ఉద్యోగులకు ఈ లీవ్ రూల్ వర్తించదు.