Page Loader
Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్ 
తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్

Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 16, 2024
05:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ వారం స్వాతంత్య్ర దినోత్సవం,వరలక్ష్మీవ్రతం,వీకెండ్ హాలీడేస్ రావడంతో ప్రజలంతా ప్రయాణాలు చేస్తున్నారు. సొంత ఊరికి, టూర్‌లకు వెళ్తున్నారు. దీంతో బస్సు, రైళ్లలో ప్రజలు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు ప్రకటించింది. ఇందులో సికింద్రాబాద్, నరసాపురం, కాకినాడ, తిరుపతికి ప్రయాణించే మొత్తం 8 రైళ్లు ఉన్నాయి.

వివరాలు 

ప్రత్యేక రైళ్ల జాబితా ఇదే ..

కాచిగూడ - తిరుపతి రైలు ఆగస్ట్ 16న రాత్రి 10.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి... 17వ తేదీ ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి - కాచిగూడ రైలు ఆగస్ట్ 17న తిరుపతిలో రాత్రి 7.50 గంటలకు బయలుదేరి... 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. కాకినాడ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6.30 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి... 19న ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్ - కాచిగూడ రైలు ఆగస్ట్ 19న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి 20వ తేదీ ఉదయం 8 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది.

వివరాలు 

ప్రత్యేక రైళ్ల జాబితా ఇదే ..

నర్సాపూర్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 18న సాయంత్రం 6 గంటలు నర్సాపూర్ నుంచి బయలుదేరి, 19న ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ రైలు ఆగస్ట్ 17, 19 తేదీల్లో రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి 18న ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. అలాగే, 18, 20 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరనున్న ఈ రైలు 19, 21 తేదీల్లో ఉదయం 6.30 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది.