Bhadradri: 18 హస్తాల వీరన్న విగ్రహానికి 800 ఏళ్ల చరిత్ర..
ఈ వార్తాకథనం ఏంటి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. ఇటీవల ఆయన ఈ విగ్రహాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి పలు విశేషాలను వెల్లడించారు. శిల్పశాస్త్ర పరంగా ఈ విగ్రహం అత్యంత అరుదైన శిల్పకళా సంపదగా గుర్తించబడిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శిల్పరూపం మరెక్కడా కనిపించదని వివరించారు. కనకగిరి గుట్టలపై వెలసిన వీరభద్రస్వామి ఆలయానికి క్షేత్రపాలకుడిగా, ఆలయాన్ని సంరక్షించే దైవంగా ఈ 18 హస్తాల వీరన్న విగ్రహాన్ని చెక్కినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
800 ఏళ్ల నాటి కనకగిరిగుట్టలపై ఉన్న హస్తాల వీరన్న విగ్రహం
భద్రాద్రి జిల్లా బెండాలపాడు కనకగిరిగుట్టలపై ఉన్న హస్తాల వీరన్న విగ్రహం 800 ఏళ్ల నాటిదని, శిల్పశాస్త్రం ప్రకారం తెలంగాణలోనే అరుదైనదని, వీరభద్రస్వామికి క్షేత్రపాలకుడిగా చెక్కినట్లు చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు. pic.twitter.com/8paeGys4xI
— TG Govt Updates (@TGGovtUpdates) July 1, 2026