LOADING...
Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి తొమ్మిది మంది మృతి
దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి తొమ్మిది మంది మృతి

Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఏసీ పేలి తొమ్మిది మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
09:01 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఇంట్లో అమర్చిన యిర్ కండీషనర్ (ఏసీ) పేలడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివరాలు 

ఒక్కసారిగా మంటలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,వివేక్ విహార్‌లోని ఓ భవనంలో రెండో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రరూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడ ఉన్న వారు బయటకు రావడానికి ముందే మంటలు వేగంగా విస్తరించాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న నలుగురు బయటకు రాలేకపోయారు. అగ్నికి ఆహుతై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

వివరాలు 

అదుపులోకి మంటలు 

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం సంభవించింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement