Page Loader
'రామచరితమానస్'‌ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన  బిహార్ మంత్రి 
'రామచరితమానస్'‌ను పొటాషియం సైనైడ్ పోల్చి బిహార్ మంత్రి

'రామచరితమానస్'‌ను పొటాషియం సైనైడ్ తో పోల్చిన  బిహార్ మంత్రి 

వ్రాసిన వారు Stalin
Sep 15, 2023
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ విద్యాశాఖ మంత్రి, ఆర్జేడీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. రామాయణం ఆధారంగా రూపొందించిన రామచరితమానస్ అనే హిందూ మత గ్రంథాన్ని ఆయన పొటాషియం సైనైడ్‌తో పోల్చారు. హిందీ దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. యాభై ఐదు రకాల వంటకాలు వడ్డించి, అందులో పొటాషియం సైనైడ్ కలిపితే మీరు తింటారా? అని ప్రశ్నించారు. రామచరితమానస్ కూడా పొటాషియం సైనైడ్ లాంటిదని అన్నారు. బాబా నాగార్జున, లోహియాతో సహా చాలా మంది రచయితలు రామచరితమానస్‌ను విమర్శించినట్లు ఆయన గుర్తు చేశారు. రామచరితమానస్‌ను తాను తీవ్రంగా వ్యతిరేకిస్తానని చంద్రశేఖర్ అన్నారు. జీవితాంతం ఈ వ్యతిరేకత కొనసాగుతుందన్నారు.

బిహార్

చంద్ర శేఖ‌ర్‌ మతాన్ని మర్చుకోవాలి: బీజేపీ

ఏకలవ్య బొటనవేలు తెగిపోవడానికి, జగదేవ్ ప్రసాద్‌ను కాల్చిచంపడానికి కారణాలు ఏంటని గూగుల్‌లో వెతికితే తాను రామచరితమానస్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనేది తెలుస్తుందని మంత్రి చంద్రశేఖర్ అన్నారు. ఈ దేశంలో కుల గణన జరగాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను టార్గెట్ చేసింది. బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. రామచరిత్‌మానస్‌పై మంత్రి చంద్రశేఖర్‌ నిరంతరం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నా నితీష్ కుమార్ పట్టడం లేదా అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ సనాతన ధర్మాన్ని నిరంతరం అవమానిస్తున్నారని చెప్పారు. అలాగే చంద్ర శేఖ‌ర్‌కు ఏదైనా ఇబ్బంది ఉంటే మ‌తాన్ని మార్చుకోవాల‌ని సూచించారు.