AP Cabinet: వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఝలక్.. పేర్లు మార్పుతో కౌంటర్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా విద్య, పునరుత్పాదక శక్తి, భూ కేటాయింపులు, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక కీలక అంశాలకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్-2016 సవరణ బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
నంబూరులోని వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీకి బ్రౌన్ ఫీల్డ్ కేటగిరి కింద అనుమతి మంజూరైంది. పెద్దకాకానిలోనూ ప్రైవేట్ యూనివర్సిటీ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.
Details
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్
రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఎస్‌సీ వర్గీకరణకు గ్రీన్‌సిగ్నల్
ఎస్సీ వర్గీకరణపై ఇటీవల రాజీవ్‌రంజన్ మిశ్రా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగా, దానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాన్ని యూనిట్‌గా వర్గీకరించాలని నిర్ణయించారు. 2026 జనాభా లెక్కల తర్వాత జిల్లాను యూనిట్‌గా వర్గీకరించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Details
అమరావతిలో నిర్మాణ పనులకు నిధుల సమీకరణ
రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సంబంధించి ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు సహా హడ్కో వంటి సంస్థలు నిధుల కోసం ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యిందని కేబినెట్ ఆమోదం తెలిపింది.
విద్యా రంగంలో సంస్కరణలు
ఏపీ స్టేట్ టీచర్స్ ట్రాన్స్‌ఫర్స్, రెగ్యులేషన్ యాక్ట్ - 2025 డ్రాఫ్ట్ బిల్లుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లకు ఈ నిబంధన
Details
ఎన్నో రోజులు పోరాడిన పేరు మార్పు
వైఎస్సార్ జిల్లాను ఇకపై వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
గత ప్రభుత్వం వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చగా, ఇప్పుడు మళ్లీ కడపగా పునరుద్ధరించారు. ప్రజాసంఘాలు, స్థానికుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ మార్పు చేశారు.
రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్
అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పునరుత్పాదక శక్తి ప్లాంట్ల ఏర్పాటుకు భూమి కేటాయింపునకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది.
400 కేవీడీసీ లైన్ ఏర్పాటుకు రూ.1082 కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టులకు ఆమోదం
సీఎం కార్యాలయంలో ముగ్గురు ఫొటోగ్రాఫర్లు, ముగ్గురు వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Details
నాగబాబుకు ఏ శాఖ..?
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై చంద్రబాబుతో ప్రత్యేకంగా చర్చించారు. పిఠాపురం సభ, నేతల వ్యాఖ్యలపై వీరిద్దరి మధ్య చర్చ సాగినట్లు సమాచారం.
సీఎంను కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్
ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల ఏఐ టెక్నాలజీతో 7 సెకన్లలో గుండెజబ్బులు గుర్తించే యాప్‌ను అభివృద్ధి చేశాడు. సీఎం చంద్రబాబు అతనిని అభినందించారు.
వైద్యం రంగంలో ఇలాంటి ఆవిష్కరణలకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.