Page Loader
చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 
చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్

చెన్నైలో రోడ్డుపై ఆగిపోయిన రూ.535 కోట్లతో వెళ్తున్న ఆర్‌బీఐకి కంటైనర్ 

వ్రాసిన వారు Stalin
May 18, 2023
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిజర్వ్ బ్యాంక్ నుంచి చెన్నైలోని విల్లుపురానికి రూ. 1,070కోట్ల నగదుతో వెళ్తున్న రెండు కంటైనర్ ట్రక్కుల్లో ఒకటి సాంకేతిక లోపంతో రోడ్డుపైనే ఆగిపోయింది. అయితే ఆగిపోయిన కంటైనర్‌లో రూ.535 కోట్ల నగదు ఉండటం గమనార్హం. ఇది తెలిసిన స్థానిక పోలీసులు అప్రమత్తమయ్యారు. రూ.535 కోట్ల నగదుతో వెళ్తున్న ట్రక్కు చెడిపోయిందని తెలుసుకున్న క్రోంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల ఎస్కార్టుతో కంటైనర్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. జిల్లాలోని బ్యాంక్‌లకు కరెన్సీని అందించేందుకు చెన్నైలోని ఆర్‌బీఐ కార్యాలయం నుంచి రెండు కంటైనర్లు బయలుదేరాయి.

బ్యాంకు

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు కంటైనర్ తరలింపు

సాంకేతిక లోపంతో రోడ్డుపైన ఆగిపోయిన కంటైనర్‌ను భద్రతా కారణాల దృష్ట్యా దానిని చెన్నైలోని తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధాకు తరలించారు. తాంబరం అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ బృందంతో సాయంతో కంటైనర్‌ను సిద్ధా ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. ట్రక్కు అందులో ఉన్న నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధా గేట్లను మూసివేశారు. ఇన్‌స్టిట్యూట్‌లోకి ప్రవేశించడం గంటల పాటు నిషేధించారు. అయితే మెకానిక్‌లు ట్రక్కును రిపేరు చేయలేకపోవడంతో చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్‌కు తిరిగి దాన్ని పంపించారు.