Delhi: దిల్లీలో దారుణ హత్య.. 'AI'సాయంతో హంతకుల గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో దారుణ హత్య జరిగింది. జనవరి 10న తూర్పు దిల్లీలోని గీతా కాలనీ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.
పోస్ట్‌మార్టంలో మరణానికి కారణం గొంతు నులిమి చంపినట్లు తేలింది.
మృతదేహం శరీరంపై లేదా చుట్టుపక్కల ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో చనిపోయిన వ్యక్తిని గుర్తించడం, హంతకులను పట్టుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది.
ఈ క్రమంలో దిల్లీ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి హత్య కేసులో నిందితులను దిల్లీ పోలీసులు పట్టుకున్నారు.
హత్యకు గురైన వ్యక్తిని గుర్తించడమే కాకుండా.. హంతకుడిని ట్రాప్ చేయడంలో ఏఐ టెక్నాలజీ సాయపడిందని పోలీసులు వెల్లడించారు.
ఏఐ
బాధితుడి ముఖాన్ని ఏఐ టెక్నాలజీతో రీక్రియేట్ చేసి..
హత్యకు గురైన వ్యక్తి ముఖం గుర్తించలేని విధంగా ఉండటతో పోలీసులు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి బాధితుడి ముఖాన్ని రీక్రియేట్ చేశారు.
డిజిటల్‌గా రూపొందించిన బాధితుడి ముఖాన్ని ఐదు వందల రూపాల్లో ఫొటోలను దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో అతికించారు.
సోషల్ మీడియాలో సర్క్యూలెట్ చేశారు. ఆ ఫోటో చూసిన ఓ వ్యక్తి అది తన అన్న హితేంద్ర అని చెప్పాడు. అతని వద్ద పోలీసులు వివరాలు తీసుకొగా.. హితేంద్ర ముగ్గురితో గొడవ పడ్డాడని పోలీసులు గుర్తించారు.
గొడవ పడిన ఆ ముగ్గురు కలిసి హితేంద్రను గొంతుకోసి హత్య చేసి మృతదేహాన్ని ఓ మహిళ సాయంతో దాచిపెట్టినట్లు పోలీసుల వచారణలో తేలింది. మహిళ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.