Page Loader
తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత 
తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత

తమిళనాడు: విధ్వంసం సృష్టించిన అరికొంబన్ ఏనుగు ఎట్టకేలకు పట్టివేత 

వ్రాసిన వారు Stalin
Jun 05, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో విధ్వంస సృష్టించిన అరికొంబన్ అనే అడవి ఏనుగును ఎట్టకేలకు పట్టుకున్నారు. కంబమ్ ఈస్ట్ రేంజ్‌లో ఫారెస్ట్ వెటర్నరీ సర్జన్లు, అటవీ శాఖ అధికారుల బృందం సోమవారం తెల్లవారుజామున అరికొంబన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు. దాదాపు 20రోజుల పాటు కంబమ్ ఈస్ట్ రేంజ్‌పరిధిలోని పలు గ్రామాల ప్రజలకు 'అరికొంబన్' ఏనుగు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఏనుగు దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఇద్దరు చనిపోయారు. ఈ క్రమంలో అరికొంబన్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. 'అరికొంబన్'ను పట్టుకునేందుకు మూడు కుమ్కీ ఏనుగులను కూడా మోహరించారు. కుమ్కి ఏనుగులకు శిక్షణ ఇచ్చి అడవి ఏనుగులను పట్టుకునే ఆపరేషన్లలో ఉపయోగిస్తారు. అరికొంబన్‌కు గాయాలు కావడంతో దానికి చికిత్స అందించి, సురక్షితమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఐఏఎస్ సుప్రియా సాహు చేసిన ట్వీట్