LOADING...
Srikakulam - Tirupati Train : 75 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్.. శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం!
75 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్.. శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం!

Srikakulam - Tirupati Train : 75 ఏళ్ల నిరీక్షణకు ఫుల్ స్టాప్.. శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2026
04:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాంధ్ర ప్రజలకు భారీ ఊరటనిచ్చే శుభవార్త వచ్చింది. ఇకపై శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా వెళ్లేందుకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త సర్వీస్‌కు సంబంధించి ముహూర్తం కూడా ఖరారైంది. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో తిరుపతి - శ్రీకాకుళం రోడ్ - తిరుపతి మధ్య హంసఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్లు 17439/17440) నడపాలని నిర్ణయించారు. ఈ సర్వీస్ ప్రారంభానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక పాత్ర పోషించారు. ఈ రైలు రెగ్యులర్ సర్వీస్‌గా ఏప్రిల్ 13, 2026 నుంచి పట్టాలెక్కనుంది.

వివరాలు

ప్రయాణ తేదీలు - వివరాలు

ఈ రైలు ప్రారంభంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఉత్తరాంధ్ర భక్తులకు, అలాగే ఇతర అవసరాల కోసం ప్రయాణించే వారికి ఎంతో సౌలభ్యం కలగనుంది. ఇప్పటివరకు రెండు రైళ్లు మారాల్సిన ఇబ్బంది ఉండగా, ఇకపై నేరుగా తిరుపతికి చేరుకునే అవకాశం లభిస్తుంది. ఈ రైలు వారానికి ఒకసారి నడుస్తుంది. శ్రీకాకుళం రోడ్ - తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17440) సేవలు ఏప్రిల్ 13, 2026 నుంచి ప్రారంభం. తిరుపతి - శ్రీకాకుళం రోడ్ ఎక్స్‌ప్రెస్ (17439) సేవలు ఏప్రిల్ 19, 2026 నుంచి ప్రారంభం.

వివరాలు

విశాఖపట్టణం వెళ్లి రైలు మారాల్సిన అవసరం లేదు

సమయాల విషయానికి వస్తే, తిరుపతి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 4:55 గంటలకు బయలుదేరే ఈ రైలు, సోమవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సోమవారం మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీకాకుళం రోడ్ నుంచి బయలుదేరి, మంగళవారం ఉదయం 8:10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దీంతో శ్రీకాకుళం ప్రయాణికులు ఇక విశాఖపట్నం వెళ్లి రైలు మారాల్సిన అవసరం ఉండదు. ఈ హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌లో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఉంటాయి. మధ్యతరగతి ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేశారు.

Advertisement

వివరాలు

తన

దీర్ఘదూర ప్రయాణాలకు ఈ రైలు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే, ఈ కొత్త రైలు సర్వీస్‌తో శ్రీకాకుళం ప్రజల దీర్ఘకాలిక కోరిక నెరవేరిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. "జిల్లా చరిత్రలో 75 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీకాకుళం నుంచి తిరుపతికి నేరుగా రెగ్యులర్ రైలు సేవలు ప్రారంభమవుతున్నాయి. ప్రతి ఆదివారం తిరుపతి నుంచి, ప్రతి సోమవారం శ్రీకాకుళం నుంచి ఈ రైలు నడుస్తూ భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సర్వీస్‌ను మంజూరు చేసిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు హృదయపూర్వక కృతజ్ఞతలని ఆయన తెలిపారు.

Advertisement