Page Loader
Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ 
Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ

Astrology: చిచ్చుపెట్టిన జ్యోతిష్యం.. ఆత్మహత్య చేసుకున్న మహిళ 

వ్రాసిన వారు Stalin
Jan 09, 2024
05:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొంతమందికి జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్ముతుంటారు. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజ జీవితంలో కూడా జరుగుతాయని విశ్వసిస్తారు. అలా నమ్మడమే ఓ మహిళ ఆత్మహత్యకు కారణమైంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో చోటుచేసుకుంది అంబర్‌పేటకు చెందిన బబిత(28)కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి రామకృష్ణతో ఐదేళ్ల క్రితం పెళ్లైంది. వివాహం తర్వాత రామకృష్ణ-బబిత కానాజిగూడ ఇందిరానగర్‌లో నివాసం ఉంటున్నారు. యూట్యూబ్ ఛానల్‌లో చూసిన జ్యోతిష్యం ప్రకారం తనకు భర్త దూరం అవుతాడని బబిత నమ్మంది. ఇదే విషయాన్ని భర్తకు చెప్పింది. జ్యోతిష్యంలో చెప్పినవన్నీ నిజం కాదని రామకృష్ణ చెప్పాడు. అయినా నమ్మని బబిత పదేపదే అదే విషయం చెప్పడంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన బబిత చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉరేసుకొని  ఆత్మహత్య