
Maharashtra: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు కార్మికులు దుర్మరణం
ఈ వార్తాకథనం ఏంటి
Maharashtra fire accident: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఛత్రపతి శంభాజీనగర్‌లోని గ్లోవ్స్ తయారీ కర్మాగారంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 6 మంది మరణించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించి ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులను రక్షించారు.
మంటల్లో చిక్కుకుని గాయాలపాలైన కార్మికులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదంలో మరణాలు మరింత పెరింగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాత్రి 2గంటల సమయంలో ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయని ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు తెలిపారు.
ఆ సమయంలో 10-15 మంది కార్మికులు లోపల నిద్రిస్తున్నారు. ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు రావడంతో కొంతమంది బయటకు రాగలిగారని, అయితే 5-6 మంది లోపలే చిక్కుకున్నారని తోటి కార్మికులు చెప్పారు.
మహారాష్ట్ర
మృతులను గుర్తించని అధికారులు
అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ ముంగ్సే మాట్లాడుతూ.. 2:15 గంటలకు మంటల గురించి తమకు సమాచారం అందిందని, తాము సంఘటనా స్థలానికి చేరుకునేసరికి మంటలు మొత్తం ఫ్యాక్టరీకి వ్యాపించాయన్నారు.
ఇప్పటి వరకు 6 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. అయితే మరణించిన కార్మికులను ఇంకా గుర్తించలేదన్నారు.
ఈ ఫ్యాక్టరీ మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MIDC)లోని వాలూజ్ ప్రాంతంలో ఉంది.
నవంబర్‌లో మహారాష్ట్రలోని రాయ్‌ఘర్‌లో ఉన్న ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన తరువాత జరిగిన అగ్నిప్రమాదంలో 7 మంది మరణించారు. అనేక మంది ఉద్యోగులు కూడా గాయపడ్డారు.