Loading...
AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!
ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!

AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 02, 2026
04:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి. ఈ ఏడాది అనుమతించిన పరిమితికి మించి పొగాకు ఉత్పత్తి కావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గిపోవడంతో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ న్యూఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, టొబాకో బోర్డు అధికారులు, ప్రజాప్రతినిధులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయాలను ప్రకటించారు.

వివరాలు

ప్రతి బార్న్‌కు రూ.50 వేల వడ్డీలేని రుణం

పొగాకు రైతులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కల్పించేందుకు ప్రతి బార్న్‌కు రూ.50 వేల చొప్పున రెండేళ్ల కాలపరిమితితో వడ్డీ లేని రుణాన్ని కేంద్ర ప్రభుత్వం అందించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 45 వేల బార్న్‌లకు కలిపి సుమారు రూ.250 కోట్ల రుణ సదుపాయం కల్పించనున్నారు.

దీంతో దాదాపు 40 వేల మంది ఎఫ్‌సీవీ పొగాకు రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు.

వివరాలు

ధరలోటు భర్తీకి రూ.100 కోట్లు

లో-గ్రేడ్, ఆఫ్-స్టైల్ పొగాకు విక్రయాల్లో రైతులు ఎదుర్కొంటున్న నష్టాన్ని భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

కిలోకు రూ.10 చొప్పున ధరలోటు భర్తీ అందించేందుకు రూ.100 కోట్ల నిధులను కేటాయించింది.

ఈ మొత్తాన్ని వ్యవసాయ శాఖ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ADVERTISEMENT

వివరాలు

గ్రేడ్‌ల వారీగా కొనుగోలు ధరలు

రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా వ్యాపారులు, ఎగుమతిదారులు కూడా అంగీకరించారు. నిర్ణయించిన ధరలు ఇలా ఉన్నాయి:

బ్రైట్ గ్రేడ్ - కిలోకు రూ.230

మీడియం గ్రేడ్ - కిలోకు రూ.190

లో గ్రేడ్ - కిలోకు రూ.110

ఆఫ్-స్టైల్ - కిలోకు రూ.130

ADVERTISEMENT

వివరాలు

వేలం ప్రక్రియ వేగవంతం

వేలం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు.

రోజుకు 20 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేస్తూ, రాబోయే రెండు నెలల్లో మొత్తం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఇతర రాష్ట్రాల పొగాకు మార్కెట్‌లోకి రాకముందే ఆంధ్రప్రదేశ్ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజ్ఞప్తి చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో తీసుకున్న ఈ నిర్ణయాలు ఎఫ్‌సీవీ పొగాకు రైతులకు గణనీయమైన ఊరటనిచ్చి, ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో వారికి కొండంత అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.

ADVERTISEMENT