Page Loader
విజయవాడ: అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం
విజయవాడ: అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

విజయవాడ: అక్కినేని హాస్పిటల్‌లో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

వ్రాసిన వారు Stalin
Dec 05, 2023
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

Akkineni Hospital: విజయవాడలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కినేని మహిళా హాస్పిటల్‌లోని పైఅంతస్తులో సోమవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా మంటలు రావడంతో ఆస్పత్రిలో రోగులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఆస్పత్రిలోని సిబ్బంది రోగులను ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి.. సమాచారం అందించగా.. రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వల్ల స్వల్పంగా ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం ఆస్పత్రి సిబ్బంది అంచనా వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎగిసి పడుతున్న మంటలు