AP New Airport : ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ఎయిర్‌పోర్ట్.. ఆ ప్రాంత రూపురేఖలు మార్చే ప్రణాళిక!
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో ఎయిర్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఈ కొత్త ఎయిర్‌పోర్ట్‌ను సీఆర్డీఏ పరిధిలో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
ఈ విమానాశ్రయంతో ఆ ప్రాంతం అభివృద్ధి, రూపురేఖలు మారిపోతాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో గన్నవరం (విజయవాడ), విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో విమానాశ్రయాలున్నాయి.
కానీ ఎయిర్ కనెక్టివిటీని మరింత పెంచడానికి కొత్త విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
దావోస్‌లో, మంత్రి నారా లోకేశ్, ప్రభుత్వ అధికారులు, ఎయిర్ ఇండియా, ఇతర సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు.
Details
భూముల ధరలు పెరిగే అవకాశం
ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణం కోసం సీఆర్డీఏ పరిధిలో 3,000 నుంచి 5,000 ఎకరాల విస్తీర్ణంలో పనులు చేపట్టాలని భావిస్తున్నారు.
ఈ విమానాశ్రయాన్ని అమరావతికి సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
అమరావతిలో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఎయిర్‌పోర్ట్ నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగే అవకాశముంది.
ఇక్కడకు ఇతర సంస్థలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాయని భావిస్తున్నారు.
ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ద్వారా, అమరావతిలో కూడా విమానాశ్రయం ఏర్పాటు అవుతుందని, నేరుగా ప్రయాణికులు అమరావతికి చేరుకోవచ్చని అధికారులు తెలిపారు.