
Panchkula: పంచకులలో డాక్టర్‌ను బోనెట్‌పై 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన కారు
ఈ వార్తాకథనం ఏంటి
ఒక వైద్యుడిని సుమారు 50మీటర్ల వరకు కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ఘటన హర్యానాలోని పంచకులో జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గగన్ అనే బాధిత వైద్యుడు తన కొడుకును ట్యూషన్ నుంచి తీసుకొస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. గగన్ ఫిర్యాదు మేరకు పంచకుల పోలీసులు కేసు నమోదు చేశారు.
పంచకులలోని సెక్టార్ 8ట్రాఫిక్ జంక్షన్‌లో గగన్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేయడానికి ఓ కారు ప్రయత్నించిందని ఇన్వెస్టిగేషన్ అధికారి రవిదత్ తెలిపారు.
ఓవర్ టేక్ చేసే సమయంలో గగన్ వాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ విషయంపై కారులో ఉన్న వ్యక్తులతో గగన్ మట్లాడానికి వెళ్లినప్పుడు, కారులో ఉన్న వ్యక్తులు గగన్‌ను 50మీటర్ల వరకు ఈడ్చుకెళ్లినట్లు రవిదత్ వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డాక్టర్‌ను బ్యానెట్‌పై ఈడ్చుకెళ్తున్న వీడియో
A doctor dragged on a car bonnet in #Panchkula in road rage pic.twitter.com/QROXAyeryj
— Umer (@0mer_ah) August 28, 2023