LOADING...
Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే 
Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే

Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసు.. ప్రివిలేజ్ కమిటీ విచారణపై సుప్రీంకోర్టు స్టే 

వ్రాసిన వారు Stalin
Feb 19, 2024
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ నోటీసుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో ప్రివిలేజెస్ కమిటీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. మమతా బెనర్జీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ చర్య తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసులు జారీ చేసి.. 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ.. ఈ అంశం రాజకీయ ప్రేరేపితమని అన్నారు. దాఖలైన ఫిర్యాదు పూర్తిగా తప్పుల తడక అన్నారు.

పార్లమెంట్

అసలు ఈ వివాదం ఏంటి? 

పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర పరగణా 24లోని సందేశ్‌ఖాలీ గ్రామానికి చెందిన మహిళలు టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్ కొంతమంది మహిళలపై లైంగిక దాడి చేశారని ఆరోపించారు. దీనితో పాటు షాజహాన్ తమ భూమిని ఆక్రమించారని విమర్శించారు. టీఎంసీ నాయకుడు షాజహాన్ షేక్, అతని సహచరులు మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయానికి సంబంధించి, బీజేపీ ఎంపీ సుకాంత్ మజుందార్ సందేశ్‌ఖాలీకి వెళుతుండగా.. అక్కడికి వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించారు. ఆ తర్వాత బీజేపీ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో మజుందార్‌కు పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ తదితరులపై మజుందార్ ఫిర్యాదు చేశారు.

బీజేపీ

సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్ సర్కార్

మజుందార్ ఫిర్యాదుపై లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ పశ్చిమ బెంగాల్ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులను పిలిపించింది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, క్రూరత్వంతో వ్యవహరించారని మజుందార్ ఆరోపించారు. ఈ మేరకు ఫిబ్రవరి 19న బంగాల్ సీఎస్‌తో పాటు ఇతర అధికారులు హాజరు కావాలని ప్రివిలేజెస్ కమిటీ ఆదేశించింది. ప్రివిలేజెస్ కమిటీ విచారణకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ప్రివిలేజెస్ కమిటీ విచారణపై స్టే విధించింది.