Kavitha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం వరకు వైద్యులు పలు రకాల పరీక్షలు ఆమెకు నిర్వహించనున్నారు. కవిత ఆరోగ్యం కొంతకాలంగా బాగాలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంలో తీహార్ జైలులో ఉన్న సమయంలోనే కవిత అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. గైనిక సమస్యలు, తీవ్ర జ్వరంతో బాధపడినట్లు తెలిపారు. అప్పట్లో దిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా, గైనిక సమస్య ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు.