Page Loader
 ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు 
ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు

 ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 29, 2023
09:36 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. 21 ఏళ్ల గర్భిణికి ఆమె తల్లి, సోదరుడు నిప్పంటించడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈఘటన నవాడ ఖుర్ద్ గ్రామంలో చోటుచేసుకుంది.శరీరంపై 70 శాతం కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను చికిత్స నిమిత్తం ఉన్నత కేంద్రానికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో శారీరక సంబంధం ఏర్పడి గర్భం దాల్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.బాలిక తల్లి,సోదరుడు శుక్రవారం ఆమెను అడవిలోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి,సోదరుడిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.విచారణ జరుగుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అడవిలో 21 ఏళ్ల గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు