Page Loader
Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య 
Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య

Hyderabad: మర్మంగాన్ని కోసి.. బాలాపూర్ రౌడిషీటర్ దారుణ హత్య 

వ్రాసిన వారు Stalin
Jan 11, 2024
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో దారుణ హత్య జరిగింది. బాలాపూర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ రౌడీ షీటర్‌ను అత్యంత కిరాతకంగా కడతేర్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. చనిపోయిన రౌడీ షీటర్‌ను ముబారఖ్ సిగార్‌గా పోలీసులు గుర్తించారు. ముబారఖ్ సిగార్‌ కొంతకాలంగా బాలాపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఈ ప్రాంతంలోకి అతనికి రౌడీ షీటర్‌గా పేరుంది. ఈ క్రమంలో అతనికి విరోధులు తయారయ్యారు. ఇన్నాళ్లు అదును కోసి వేచి చూసిన దుండగులు.. బుధవారం రాత్రి ఒంటరిగా దొరికిన ముబారఖ్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.

హత్య

క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించిన పోలీసులు

ముబారఖ్‌ను దుండగులు కత్తులతో దారుణంగా పొడిచారు. అంతేకాకుండా ముబారఖ్ మర్మాంగాలను కూడా కోశారు. ముబారఖ్ అక్కడిక్కడే చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి.. హత్య చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నయ్యారు. ముబారఖ్‌తో విరోధం ఉన్నవారే ఈ హత్య చేసి ఉంటారనే అనుమానంతో పోలీసులు ఆ కోణంలోనూ విచారణ చేపట్టారు. అయితే ఇలా క్రూరంగా హత్య చేయడంపై పోలీసులు సైతం దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఏదైనా విరోధం ఉంటే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి కానీ, ఇలా హత్యలు చేసుకోవద్దని వెల్లడించారు.