Earthquake: విశాఖలో తెల్లవారుజామున స్వల్ప భూకంపం.. భయంతో బయటకు పరుగులు తీసిన ప్రజలు
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం నగర పరిధిలో మంగళవారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించాయి. ఉదయం సుమారు 4.18 గంటల సమయంలో ఆరిలోవ, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, హెచ్‌బీ కాలనీ, అల్లిపురం, ఎండాడ, భీమిలి, పెందుర్తి వంటి ప్రాంతాలు స్వల్పంగా కంపించాయి. ముఖ్యంగా భీమిలి బీచ్ రోడ్ పరిసరాల్లో పెద్ద శబ్దం వినిపించడంతో భూమి ప్రకంపించిందని స్థానికులు తెలిపారు. సింహాచలం ప్రాంతంలో కూడా ఇలాంటి స్వల్ప ప్రకంపనలు నమోదయ్యాయి. ఆకస్మికంగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతసేపు భయాందోళనలతో ఆ ప్రాంతం కదలికలతో నిండిపోయింది.
Details
అల్లూరి సీతారామరాజ జిల్లాలో కంపించిన భూమి
ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ తెల్లవారుజామున భూమి కంపించింది. ఉదయం 4.19 గంటల సమయంలో 3.7 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అక్కడ కూడా పెద్ద శబ్దం వినిపించడంతో ప్రజలు ఒక్కసారిగా భయంతో ఉలిక్కిపడ్డారు. భూమి ప్రకంపనలతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.