Page Loader
Borewell: బారుబావిలో పడిన  రెండున్నరేళ్ల బాలిక మృతి
Borewell: బారుబావిలో పడిన రెండున్నరేళ్ల బాలిక మృతి

Borewell: బారుబావిలో పడిన  రెండున్నరేళ్ల బాలిక మృతి

వ్రాసిన వారు Stalin
Jan 02, 2024
11:30 am

ఈ వార్తాకథనం ఏంటి

గుజరాత్‌ (Gujarat)లోని ద్వారకలోని రాన్ గ్రామంలో సోమవారం రెండున్నరేళ్ల బాలిక బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. అయితే రెస్క్యూ టీమ్ ఆ బాలికను ప్రాణాలతో రక్షించినా.. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. దీంతో బోరుబావిలో చిన్నారి కథ విషాదాంతమైంది. 100 అడుగుల లోతున్న బోరుబావిలో పడిన బాలిక.. 30 నుంచి 35 అడుగుల లోతులో చిక్కుకుంది. రాత్రి 9:48 గంటలకు బాలికను ఎన్‌డీఆర్‌ఎఫ్ రెస్క్యూ టీమ్ బయటకు తీసింది. రాత్రి 10 గంటల సమయంలో బాలికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు తెలిపారు. బాలికను ఏంజెల్ షఖ్రాగా గుర్తించారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

చికిత్స పొందుతూ బాలిక మృతి