Delhi Murder: ప్రియుడు దక్కలేదనే కోపంతో అతని 11ఏళ్ల కొడుకుని హత్య చేసిన మహిళ
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీలో దారుణం జరిగింది. ఇంద్రపురి ప్రాంతంలో ఓ మహిళ 11బాలుడు దివ్యాంష్‌ను గొంతుకోసి హత్య చేసింది.
ఆ తర్వాత ఇంట్లోని బెడ్ బాక్స్‌లో బాలుడి మృతదేహాన్ని ఆమె దాచి పెట్టింది. హత్య చేసిన 24ఏళ్ల పూజను దిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పూజా, దివ్యాంష్‌తండ్రి జితేంద్ర 2019 నుంచి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. జితేంద్ర తన భార్యకు విడాకులు ఇచ్చి, పూజను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు.
2022లో జితేంద్ర పూజను విడిచిపెట్టి తన భార్య, కుమారుడు దివ్యాన్ష్‌తో కలిసి జీవించడానికి తిరిగి వాళ్ల దగ్గరకు వెళ్లాడు. దీంతో పూజ జితేంద్రపై కోపం పెంచుకుంది. అతనికి గుణపాఠం ఎలాగైనా చెప్పాలనుకుంది.
దిల్లీ
300 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు
దివ్యాంశ్ కారణంగానే జితేంద్ర తనను వివాహం చేసుకోవడానికి నిరాకరించాడని పూజ భావించింది. ఈ క్రమంలో దివ్యాంశ్‌పై కోపం పెంచుకుంది.
ఈ క్రమంలో జితేంద్ర నివసిస్తున్న ఇంటి అడ్రస్‌ను కామన్ ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని అక్కడికి వెళ్లింది. పూజ ఇంట్లోకి వేళ్లే సమయానికి ఎవరూ లేరు. దివ్యాంశ్ నిద్రపోతూ కనిపించాడు.
ఇదే అదునుగా భావించిన పూజ దివ్యాంశ్ గొంతుకోసి హత్య చేసింది. ఆ మృత దేహాన్ని బెడ్ బాక్స్‌లో దాచిపెట్టింది. ఈ ఘటన ఆగస్టు 10న జరిగింది.
జితేంద్ర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 300సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. హత్య చేసింది పూజగా గుర్తించారు.
3రోజుల తర్వాత పూజ జాడను తెలుసుకున్న దిల్లీ పోలీసులు, తర్వాత ఆమెను అరెస్టు చేశారు.