ప్రియుడిని కలిసేందుకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాలిక.. షాకిచ్చిన ఎయిర్పోర్ట్ పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియా ప్రేమలు ఈ మధ్య వీపరితంగా ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో పాకిస్థాన్ లోని ఓ యువకుడిని రాజస్థాన్ కు చెందిన ఓ మైనర్ బాలిక ప్రేమించింది.
అందుకోసం పాకిస్థాన్ లో ఉన్న ప్రియుడిని కలిసేందుకు జైపూర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. వీసా, పాస్ పోర్టు లేకుండా డైరక్టుగా టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి పాకిస్థాన్ కు టికెట్ కావాలని ఆడిగింది. అనుమానం వచ్చిన పోలీసులు అమెను విచారించారు.
అయితే పాకిస్థాన్ యువకుడితో ప్రేమ వ్యవహారం కారణంగానే ఎయిర్ పోర్టుకు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అశ్చర్యానికి గురయ్యారు.
Details
మైనర్ బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
విచారణలో ఆ బాలిక తాను పాకిస్తానీ అని, రాజస్థాన్ లోని తన ఆంటీ ఇంటికి వచ్చానని చెప్పింది. ఇప్పుడు తిరిగి వెళ్లాలనుకుంటున్నట్లు ఆ బాలిక అధికారులతో చెప్పింది. ఆమె మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో పూర్తిస్థాయిలో పోలీసులు విచారించారు.
ఆ మైనర్ బాలికది రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్ జిల్లా రతన్పుర గ్రామమని పోలీసులు తెలుసుకున్నారు.
అనంతరం ఆ బాలికను తిరిగి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.