Page Loader
అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్

అమరావతి రింగ్‌ రోడ్డు కేసులో 'ఏ14'గా నారా లోకేశ్

వ్రాసిన వారు Stalin
Sep 26, 2023
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ను ఏ14గా ఏపీ సీఐడీ పేర్కొంది. సీఐడీ కోర్టులో దాఖలు చేసిన మెమోలో ఏసీబీ ఈ విషయాన్ని చెప్పింది. ఈ కేసులో ఇప్పటికే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు పలువురిని ఏపీ సీఐడీ అధికారులు నిందితులుగా చేర్చిన సంగతి తెలిసిందే. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు ఇటీవల హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి, టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అసలు డిజైన్‌ను మార్చారని సీఐడీ అభియోగాలు మోపింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈ కేసులో ముందస్తు బెయిల్‌కు చంద్రబాబు దరఖాస్తు