Page Loader
Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 
ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు

Swati Maliwal: ఢిల్లీ సీఎం హౌస్‌లో స్వాతి మలివాల్ పై దాడి ? .. దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు 

వ్రాసిన వారు Stalin
May 13, 2024
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారని ఢిల్లీ పోలీసులకు సంబంధించిన వర్గాలు పేర్కొన్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ హౌస్‌ నుంచి ఢిల్లీ పోలీసులకు పీసీఆర్‌ కాల్‌ వచ్చిందని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఫోన్ చేసిన వ్యక్తి తనను స్వాతి మలివాల్ అని పరిచయం చేసుకుంది. ఢిల్లీ సీఎం నివాసం నుంచి సోమవారం ఉదయం 9 గంటలకు ఢిల్లీ పోలీసులకు రెండు పీసీఆర్ కాల్స్ వచ్చినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నా స్వాతి మలివాల్ కనిపించలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ పోలీసులు సీఎం హౌస్‌లోకి వెళ్లకూడదు. పీసీఆర్ కాల్‌లో నిజమెంతో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Details 

ఆప్ పై ధ్వజమెత్తిన బీజేపీ 

ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం..ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పీఏ తనపై సోమవారం దాడి చేశారని రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న స్వాలి మలివాల్ ఆరోపించారు. కేజ్రీవాల్ నివాసంలో సీఎం పీఏ విభవ్ కుమార్ కొట్టారని ఢిల్లీ మహిళా కమిషర్ మాజీ చైర్‌పర్సన్ ఆరోపించారు. అయితే ఈ విషయమై పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదు.దీనిపై స్వాతి మలివాల్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు. మలివాల్‌కు సంబంధించి ఢిల్లీ పోలీసుల ఈ వాదనల తర్వాత, బీజేపీ కూడా స్పందించింది. మలివాల్‌పై దాడి ఆరోపణపై ఆప్‌పై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ధ్వజమెత్తారు. ఈ విషయమై పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎందుకు మౌనం వహించారని అన్నారు.బీజేపీ నేత అమిత్ మాల్వియా ఎక్స్ ద్వారా ట్వీట్ చేశారు.