Page Loader
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం 
Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ నాయకుడిగా రాఘవ్ చద్దా నియామకం 

వ్రాసిన వారు Stalin
Dec 16, 2023
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

Raghav Chadha: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభ‌లో పార్టీ నాయకుడిగా నియమితులయ్యారు. సంజయ్‌ సింగ్‌ గైర్హాజరీలో రాఘవ్‌ చద్దా ఇకపై పార్టీ నాయకుడిగా ఉంటారని ఆప్‌ నాయకత్వం రాజ్యసభ ఛైర్మన్‌కు రాసిన లేఖలో పేర్కొంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మద్యం పాలసీ స్కామ్‌ కేసులో జైలులో ఉన్నారు. సంజయ్ సింగ్ లేకపోవడంతో, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ నాయకుడిగా నియమించింది.

ఆమ్ ఆద్మీ పార్టీ

సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌పై 27న విచారణ

ప్రస్తుతం పార్ల‌మెంట్ శీతాకాల సమావేశాలు జరగుతున్న నేపథ్యంలో ఏ విష‌యంలో అయినా పార్టీ లైన్‌ను వివరించే బాధ్యతను సభలో ఆ పార్టీ నాయకుడు నిర్వర్తిస్తారు. అయితే ఇన్నాళ్లు ఆప్ రాజ్యసభ నాయకుడిగా ఉన్న సంజయ్ సింగ్ ఇప్పుడు సభలో లేకపోవడంతో ఈ బాధ్యతను రాఘవ్ చద్దాకు అప్పగించారు. గత పార్లమెంట్ సమావేశంలో సంజయ్ సింగ్, రాఘవ్ చద్దాలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. శీతాకాల పార్లమెంట్ సమావేశాలకు ముందు రాఘవ్ చద్దాపై సస్పెన్స్ వేటును ఎత్తి వేశారు. సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్‌పై డిసెంబర్ 27న విచారణ జరగనుంది.