Chattisgarh aap : నాలుగో జాబితా విడుదల.. 37 మందితో స్టార్ క్యాంపెయినర్లు
ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ 12 మందితో కూడిన నాల్గొ జాబితా విడుదల చేసింది. ఇదే సమయంలో 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా రిలీజ్ చేసింది. 90 మంది సభ్యుల ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి ఇప్పటివరకు 45 మంది అభ్యర్థులను ప్రకటించింది. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 1. దేవ్ గణేష్ టేకం - సమ్రి 2. అలెగ్జాండర్ - లుండ్రా 3. మున్నా తోప్పో - సీతాపూర్ 4. ప్రకాష్ టోప్పో - జష్పూర్ 5. గోపాల్ బాపుడియా - రాయ్‌ఘర్
37 మంది స్టార్ క్యాంపెయినర్లలో వాళ్లు కూడా ఉన్నారు.
6. సోబ్రమ్ సింగ్ సైమా - పాలి తనఖర్ 7. పరమేశ్వర్ ప్రసాద్ సండే - జాంజ్‌గిర్ చంపా 8. నీలం ధృవ్ - ఖల్లారి 9. సంతోష్ యాదు - బలోడా బజార్ 10. విజయ్ గురుబక్సాని - రాయ్‌పూర్ నార్త్ 11. పరమానంద్ జంగ్డే - అరంగ్ 12. భగీరథ్ మాంఝీ - బింద్రావగర్ 37 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు ఉన్నారు.
గత ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని ఆప్
ఇదే సమయంలో స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్న సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా మద్యం కుంభకోణం కేసులో జైల్లో ఉన్నారు. 2018 ఛత్తీస్‌గఢ్‌లో ఆప్ 85 మంది అభ్యర్థులను నిలబెట్టినా ఒక్క సీటు గెలవలేకపోయింది. మొత్తం 90 స్థానాల్లో 68 సీట్లు గెలిచిన కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించింది. 15 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత బీజేపీని అధికార పీఠం నుంచి దించింది. 2018లో భారతీయ జనతా పార్టీ కేవలం 15 సీట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. జేసీసీ (జే), బీఎస్పీ వరుసగా ఐదు, రెండు స్థానాలను గెలిచాయి.