NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AAP: ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు' 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AAP: ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు' 
    ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు'

    AAP: ఆప్ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: కేజ్రీవాల్ 15 'గ్యారంటీలు' 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 27, 2025
    02:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.

    విద్యార్థులు, మహిళల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆప్‌ ఎన్నో హామీలు ఇచ్చింది.

    పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు.

    ఐదేళ్లలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని అన్నారు.

    వివరాలు 

    ఆప్‌ గ్యారెంటీలు ఇవీ.. 

    ఉద్యోగాల కల్పన: నిరుద్యోగం లేని రాజధానిగా దిల్లీని మార్చడమే లక్ష్యంగా, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

    మహిళా సమ్మాన్ యోజన: అర్హులైన మహిళలకు నెలకు ₹2,100 పథకం కింద అందజేస్తారు.

    సంజీవని పథకం: 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందజేస్తారు. అలాగే నీటి సరఫరా బిల్లులను రద్దు చేస్తారు.

    విద్యార్థుల కోసం ప్రత్యేకంగా: ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, డా. అంబేద్కర్ స్కాలర్‌షిప్ స్కీమ్, దిల్లీ మెట్రోలో 50% రాయితీ.

    వృద్ధుల కోసం ప్రత్యేక సేవలు: వృద్ధులకు ఉచిత వైద్య సౌకర్యాలు.

    వివరాలు 

    ఆప్‌ గ్యారెంటీలు ఇవీ.. 

    మురుగు సమస్య పరిష్కారం: దిల్లీ నగరంలో మురుగు నీటి వ్యవస్థను మెరుగుపరచడం.

    ప్రజా సేవల పథకాలు: పూజారులు, గ్రంథీలు ఒక్కొక్కరికి ₹18,000; ఆటో, టాక్సీ, ఈ-రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు ₹1 లక్ష సహాయం. వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా అందించనున్నారు.

    ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి: 24 గంటల నీటి సరఫరా, యమునా నది శుభ్రం, యూరప్‌ మాదిరిగా రోడ్ల నిర్మాణం.

    ఆర్‌డబ్ల్యూఏలకు ప్రోత్సాహం: రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్‌ (ఆర్‌డబ్ల్యూఏ)లకు ప్రైవేటు గార్డులు అందజేయడం.

    మొత్తం 15 ప్రధాన గ్యారెంటీలతో మేనిఫెస్టోను ప్రకటిస్తూ, గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    తాజా

    Upcoming IPOs: వచ్చే వారం స్టాక్ మార్కెట్‌లో జోష్‌.. మూడు ఐపీఓల సబ్‌స్క్రిప్షన్‌, ఒక లిస్టింగ్‌! ఐపీఓ
    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై స్పందన.. కేఎస్‌సీఏ సెక్రటరీ, కోశాధికారి రాజీనామా బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Gold Rates: మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఒక్కరోజే రూ.1630 తగ్గిన తులం బంగారం ధర బంగారం
    Ravi Teja : మాస్ మహారాజా ఫ్యాన్స్ కి సూపర్ ఫ్యాన్స్.. మరోసారి థియోటర్స్‌లోకి 'వెంకీ' రవితేజ

    ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్

    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు పంజాబ్
    AAP: ఆప్‌కు షాకిచ్చిన సుప్రీంకోర్టు.. జూన్ 15లోగా పార్టీ ఆఫీస్‌ను ఖాళీ చేయాలని ఆదేశం సుప్రీంకోర్టు
    INDIA bloc: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా.. ఢిల్లీలో భారత కూటమి మెగా ర్యాలీ  ఇండియా కూటమి
    Gurpatwant Singh Pannun: ఆమ్ ఆద్మీ పార్టీ పై ఖ‌లిస్తానీ నేత తీవ్ర ఆరోప‌ణ‌లు  గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025