
INDIA bloc: మమతా బెనర్జీ తరువాత కాంగ్రెస్ కి ఝలక్ ఇచ్చిన ఆప్..
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆధినేత్రి, సీఎం మమతా బెనర్జీ తాము బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్‌తో ఎటువంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది.
తాజాగా కూటమిలో కీలక పార్టీగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా మమతా మార్గంలోనే నడుస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదని స్పష్టం చేసింది.
మొత్తం 13 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో కూటమి భవితవ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని ఆప్ పంజాబ్ యూనిట్ చేసిన ప్రతిపాదనకు అరవింద్ కేజ్రీవాల్ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు స్పష్టం చేసిన ఆప్
After Mamata Banerjee, AAP Says No Alliance With Congress In Punjab https://t.co/RNfokcxn6A @ghazalimohammad reports pic.twitter.com/Z9SX1ZFSaH
— NDTV (@ndtv) January 24, 2024