LOADING...
Aarogyasri: యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు 
యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు

Aarogyasri: యథావిధిగా తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 19, 2025
03:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి అని ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 477 ఎంప్యానెల్‌డ్‌ ఆసుపత్రులలో ఎక్కువ శాతం ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద సేవలను అందిస్తున్నాయని ఆయన వివరించారు. అయితే, కేవలం 50కి తగ్గిన ఆసుపత్రులలో మాత్రమే కొంతమేర వైద్యసేవలు ఆగిపోయినట్లు తెలిపారు. వాటిలో కూడా వెంటనే సేవలు పునరుద్ధరించాలని ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలను కోరారు. ఆసుపత్రులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తుందని ఉదయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. అలాగే, సేవలను ఆపాలని ఎవరైనా ఒత్తిడి తేవడానికో, బెదిరింపులు చేయడానికో ప్రయత్నిస్తే, కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.