Page Loader
KTR: ఈ- ఫార్మలా రేసు కేసులో.. కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు
ఈ- ఫార్మలా రేసు కేసులో.. కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు

KTR: ఈ- ఫార్మలా రేసు కేసులో.. కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ మరోసారి నోటీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
04:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫార్ములా ఈ కేసు నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మళ్లీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. ఇదివరకు కూడా ఇదే కేసులో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్‌ రేసుతో సంబంధించి మే 26న అతనికి నోటీసులు అందించగా, మే 28న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

వివరాలు 

 జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్

ఇకపోతే, గతంలోనూ కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరైన సందర్భం ఉంది. జనవరి 9న ఆయన విచారణకు హాజరయ్యారు. అయితే, ఇందుకు ముందు రెండు రోజుల ముందే విచారణ కోసం ఆయన హాజరయ్యే సమయంలో తన న్యాయవాదిని అనుమతించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత తనపై కేసును రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. అనంతరం విచారణ సమయంలో తన న్యాయవాదిని కూడా అనుమతించాలని మరో పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై హైకోర్టు అనుమతినిచ్చింది. ఈ ఆధారంగా జనవరి 9న ఆయన ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తాజాగా ఏసీబీ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో మరోసారి విచారణకు కేటీఆర్ హాజరుకావాల్సి వచ్చింది.