INS Kesari: విశాఖలో నేవీ యుద్ధనౌకకు ప్రమాదం.. తృటిలో తప్పిన సిబ్బందికి ముప్పు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Oct 31, 2026
04:07 pm
ఈ వార్తాకథనం ఏంటి
విశాఖపట్టణం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కేసరికి ప్రమాదం చోటుచేసుకుంది. నౌక ముందుభాగం కొంత మేర నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే రక్షణ, సహాయక చర్యలు చేపట్టారు. అయితే నౌకలో ఉన్న సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. ఐఎన్‌ఎస్ కేసరికి ఇటీవలే మరమ్మతులు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఈ యుద్ధనౌక తిరిగి సముద్రంలోకి ప్రయాణం (సెయిలింగ్) ప్రారంభించాల్సి ఉంది. ఇంతలోనే విశాఖ డాక్‌యార్డ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఘటనపై అధికారులు అప్రమత్తమై నౌకను రక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.