Loading...
Bandi Sanjay: ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం: బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు
ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం: బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం: బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 25, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన 'పదవులు తాత్కాలికం.. ప్రజల విశ్వాసమే అంతిమం' అని వ్యాఖ్యానించారు. సప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించడమే నిజమైన ప్రజాస్వామ్యమని పేర్కొన్నారు. తమకు పార్టీ కంటే దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజాస్వామ్యం అంటే ప్రజల గొంతును వినడం, వారి అభిప్రాయాలను గౌరవించడం, అవసరమైతే బాధ్యతను స్వీకరించే ధైర్యాన్ని కలిగి ఉండటమేనని బండి సంజయ్‌ తెలిపారు.

వివరాలు

కృతజ్ఞతలు తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్

భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అదే సిద్ధాంతాన్ని, అదే విలువలను పాటిస్తోందని అన్నారు.

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కూడా భాజపా విలువలు, బాధ్యతాయుత రాజకీయాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్నో సంవత్సరాల పాటు దేశసేవలో భాగమైన ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన సేవలను అభినందించారు.

ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్‌'లో పోస్టు చేశారు.

ADVERTISEMENT