Page Loader
Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి
Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి

Divyavani: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ నటి దివ్యవాణి

వ్రాసిన వారు Stalin
Nov 22, 2023
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ నాయకురాలు, ప్రముఖ నటి దివ్యవాణి (Divyavani) బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావ్ ఠాక్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ (Congress) తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఠాక్రే ఆమెకు కండువా అందించి పార్టీలోకి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న దివ్యవాణి జూన్‌లో రాజీనామా చేశారు. పార్టీలోని ఒక వర్గం నేతలు తనను అవమానించారని ఆరోపిస్తూ ఆమె పార్టీని వీడారు. తాజాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ చేరాలని నిర్ణయించారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజలకు దివ్యవాణి సుపరిచితురాలే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దివ్యవాణిని పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఠాక్రే