Passport: జూలై 11న అదనపు పాస్‌పోర్ట్ అపాయింట్‌మెంట్ స్లాట్లు అందుబాటులోకి
వ్రాసిన వారు
Moogati Shabari
Jul 09, 2026
10:27 am
ఈ వార్తాకథనం ఏంటి
పాస్‌పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన అదనపు అపాయింట్‌మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి ప్రకటించారు. ఇందులో భాగంగా విజయవాడ పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో 900 అదనపు స్లాట్లు, తిరుపతి పాస్‌పోర్ట్ సేవా కేంద్రంలో మరో 500 స్లాట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వివరాలు
అధికారులు కీలక ప్రకటన..
కొత్తగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలనుకునే అభ్యర్థులతో పాటు, ఇప్పటికే ఇతర తేదీలకు అపాయింట్‌మెంట్ పొందిన వారు కూడా అవసరమైతే రీషెడ్యూల్ చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు, అపాయింట్‌మెంట్ బుకింగ్, రీషెడ్యూలింగ్ సేవలు పాస్‌పోర్ట్ సేవా కేంద్రం అధికారిక వెబ్‌సైట్ www.passportindia.gov.inలో అందుబాటులో ఉంటాయని అధికారులు సూచించారు.