
Nandyal: నంద్యాలలో కాలేజీ సిబ్బంది దారుణం.. ఆరుగురు స్టూడెంట్స్‌కు శిరోముండనం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ నంద్యాల(Nandyal)లోని ఓ ప్రైవేటు జూనియర్ కాలేజీ(junior college)లో అమానవీయ సంఘనట చోటుచేసుకుంది.
విద్యాబుద్దులు నేర్పాల్సిన కాలేజీ సిబ్బంది విద్యార్థుల పట్ల దారుణంగా వ్యవహరించారు.
కాలేజీలో సోమవారం రాత్రి ఇంటర్(intermediate) సీనియర్, జూనియర్ విద్యార్థులు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం విద్యార్థులపై కఠిన చర్యలకు దిగింది. విద్యార్థులను తీవ్రంగా కర్రలతో కాలేజీ సిబ్బంది దండించారు.
ఈ క్రమంలో ఒక విద్యార్థికి చేయి విరిగింది. అంతటితో ఆగకుండా, ఆరుగురు విద్యార్థులకు సిబ్బంది శిరోముండనం చేయించడం మరింత విమర్శలకు దారి తీసింది.
ఈ వ్యవహారంపై కాలేజీ సిబ్బంది, యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
గొడవ పడ్డ విద్యార్థులను మందలించాల్సి పోయి.. వారిని కొట్టి గాయపర్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాలేజీ సిబ్బంది దాడిలో విద్యార్థులకు గాాయాలు
*నంద్యాల :*
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) November 29, 2023
*ఇంటర్ విద్యార్థుల ఘర్షణ*
*శిరోమండనం చేయించిన కళాశాల యాజమాన్యం!*
*నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి.*
*విషయం తెలిసిన కళాశాల యాజమాన్యం...వారిని దండించడం కోసం మంగళవారం విద్యార్థులను కర్రతో…