Loading...
LK Advani 100th Birthday: అద్వానీ 100వ జన్మదిన వేడుకలు.. బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక హోమం
అద్వానీ 100వ జన్మదిన వేడుకలు.. బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక హోమం

LK Advani 100th Birthday: అద్వానీ 100వ జన్మదిన వేడుకలు.. బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక హోమం

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2026
01:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానీ 99వ జన్మదినం సందర్భంగా, ఆయన 100వ ఏట అడుగుపెడుతున్న వేళ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సహా పలువురు నేతలు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో హోమం చేపట్టారు. అద్వానీ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

వివరాలు

అద్వానీ సేవలను కొనియాడిన నితిన్ నబీన్

ఈ సందర్భంగా నితిన్ నబీన్ ఎక్స్ వేదికగా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జనసంఘ్ నుంచి బీజేపీ వరకు పార్టీ విస్తరణలో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

జాతీయవాద భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, రామజన్మభూమి ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చడంలో అద్వానీ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు.

అద్వానీ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని నబీన్ అన్నారు. సిద్ధాంతాల పట్ల ఆయన చూపిన నిబద్ధతే బీజేపీని ప్రత్యేకమైన పార్టీగా నిలిపిందని పేర్కొన్నారు.

అద్వానీ హయాంలో రూపుదిద్దుకున్న నాయకత్వ బృందం ప్రస్తుతం పార్టీతో పాటు దేశాన్ని నడిపిస్తోందని తెలిపారు.

వివరాలు

దేశ సేవకు అంకితమైన నాయకుడు: అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దేశ సేవకు అంకితమైన నాయకుడిగా, బీజేపీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన నేతగా ఆయనను అభివర్ణించారు.

సాధారణ కుటుంబంలో జన్మించి బీజేపీ వ్యవస్థాపక సభ్యుడిగా, జాతీయ అధ్యక్షుడిగా, దేశ ఉప ప్రధానిగా ఎదిగిన అద్వానీ జీవితం ప్రజాసేవకు నిదర్శనమని అమిత్ షా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

'దేశమే ప్రథమం' అనే స్ఫూర్తికి అద్వానీ నిలువెత్తు ఉదాహరణ అని కొనియాడారు.

ADVERTISEMENT