Aero India Show: బెంగళూరులో ఏరో ఇండియా షో.. మాంసం విక్రయాలపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో నిర్వహించనున్న 'ఏరో ఇండియా షో' నేపథ్యంలో బృహత్ బెంగళూరు మహానగర పాలిక కీలక నిర్ణయం తీసుకుంది.
జనవరి 23 నుంచి యలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ చుట్టూ 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆంక్షలు ఫిబ్రవరి 17 వరకు అమల్లో ఉంటాయి. ఈ నిర్ణయం నాన్-వెజ్ విక్రయించే హోటళ్లకు, రెస్టారెంట్లకు కూడా వర్తించనుంది.
ఏరో ఇండియా షో ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు జరగనుంది. ఈ షో ప్రదర్శన సందర్భంగా, మాంసం విక్రయించే ప్రదేశాలలో పక్షులు, ముఖ్యంగా గద్దలు, డేగలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
Details
13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలు నిషేధం
ఇవి పొరపాటున ఎయిర్‌షో ప్రాంతంలోకి వస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలు నిషేధించాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరింది. ఈ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించింది. ఏరో ఇండియా షో బెంగళూరులో 1996 నుంచి నిర్వహిస్తున్నారు.
ఈ షో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం అనవాయితీగా మారింది. విమానాల పరిశ్రమలో ప్రగతిని, ఉత్పత్తులను ప్రదర్శించడానికి ప్రముఖ వేదికగా మారింది.
14 ఎయిర్‌షోల తర్వాత ఏరో ఇండియా తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంది.